ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేష‌న్ సొసైటీలో 1000 టీచ‌ర్ పోస్టులు


ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేష‌న్ సొసైటీ దేశ వ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* టీచింగ్ పోస్టులు
1) పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌)
అర్హత‌: 50 శాతం మార్కుల‌తో పీజీ డిగ్రీతోపాటు బీఈడీ ఉండాలి.
2) టీజీటీ (ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌)
అర్హత‌: 50 శాతం మార్కుల‌తో డిగ్రీతోపాటు బీఈడీ ఉండాలి.
3) పీఆర్‌టీ (ప్రైమ‌రీ టీచ‌ర్‌)
అర్హత‌: 50 శాతం మార్కుల‌తో డిగ్రీతోపాటు బీఈడీ/ రెండేళ్ల డిప్లొమా ఉండాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.600.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్ర‌వేశ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, టీచింగ్ స్కిల్స్‌.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.12.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 21.12.2017.
ప్ర‌వేశ ప‌రీక్ష తేది: 15 - 17.01.2018
ఫ‌లితాల వెల్ల‌డి: 28.01.2018,
ప‌రీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల ప‌రిధిలో హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, విజ‌య‌వాడ‌. వీటితోపాటు దేశ‌వ్యాప్తంగా 77 కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

Post a Comment

0 Comments